కరోనా నుంచి విముక్తికి మహా సుదర్శన చూర్ణాన్ని తీసుకోవాలట..!

మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:30 IST)
కరోనా వైరస్ నుంచి తప్పుకోవాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు వీలుగా సహజసిద్ధమైన రోగనిరోధకశక్తి శరీరంలో పెంపొందాలంటే మహాసుదర్శన ఔషధాన్ని తీసుకోవాలని.. ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన రసతంత్రసార సిద్ధప్రయోగ సంగ్రహంలో మహాసుదర్శన చూర్ణంగా పేర్కొన్న మహాసుదర్శన ఔషధంలో పలు మూలికల సారం ఉంటుంది. ఇందులో నేలవేము, తిప్పతీగ, చిత్రమాలము, తుంగమస్తల, త్రిఫల, త్రికటు మొదలైన 56 మూలికలు ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా జ్వరం దరిచేరదు. 
 
జ్వరంతో కూడిన తలనొప్పి, ఒళ్లునొప్పులు, కామెర్లు, రక్తలేమి, సాధారణ దగ్గు, జలుబు వుండదు. కాలేయ సంబంధిత రోగాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. శారీరక తత్వాన్ని అనుసరించి ఈ ఔషధాన్ని మూడు రూపాల్లో ఇవ్వవలసి ఉంటుంది. చూర్ణంగా, మాత్రల రూపంలో దీనిని తీసుకోవచ్చు. ఇది మలేరియా, టైఫాయిడ్‌లకు వ్యతిరేకం. యాంటీవైరల్‌, గుండెకు రక్షణ, ఆకలి పెంచేది, యాంటీ ఆక్సిడెంట్‌‌గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు