కొత్తిమీరతో మెరిసే అందాన్ని మీ సొంతం చేసుకోండి (video)

శుక్రవారం, 22 మే 2020 (13:51 IST)
మన వంటలకు మాత్రమే కాదు అందానికి కూడా కొత్తిమీర సొగసులను అద్దుతుంది. కొత్తిమీరలోని యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మానికి కాంతినివ్వడంతో పాటు చర్మంపై వచ్చే ముడతలను పోగొడతాయి. అందానికి మెరుగులద్దడంలో కొత్తిమీర ఏ విధంగా పనికొస్తుందో చూద్దాం.
 
పెదవులు తరచుగా ఆరిపోతూ, వాటిపై పొరలు (మృతకణాలు) ఏర్పడుతుంటాయి. దీనికి పరిష్కారంగా కొత్తిమీర పేస్ట్‌లో నిమ్మరసాన్ని కలిపి ప్రతిరోజూ పెదవులకు రాస్తూ ఉన్నట్లయితే, మీ పెదవులు అందంగా తయారవుతాయి.  ఆ సమస్య లేకుండా ఉండాలంటే.. కొత్తిమీర పేస్టును పెదాలకు రాయండి. కొత్తిమీర పేస్టునులో కాస్త నిమ్మ రసం వేయండి. రెండిటినీ బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులకు పూయండి. ఇలా రోజూ చేస్తుంటే.. మీ పెదాలు అందంగా మారిపోతాయి.
 
కొత్తిమీర పేస్ట్‌లో కలబంద గుజ్జును కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి, ఇలా చేయడం వలన చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు రాకుండా నివారించవచ్చు. కాలుష్యం కారణంగా చర్మంపై దుమ్ము పేరుకుపోయి, ముఖంపై ముడతలు రావడం మరికొన్నిసార్లు చర్మ క్యాన్సర్‌ల వంటి వాటికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు కొత్తిమీర పేస్ట్‌లో కాస్త టమోటా గుజ్జు, ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి, ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయండి. క్రమంగా ఇలా చేస్తూ ఉంటే, ఈ సమస్య తగ్గుతుంది.
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు