ఆ రుణాలకు మాత్రమే మారటోరియం : క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాల్సిందే : ఆర్బీఐ

శుక్రవారం, 27 మార్చి 2020 (13:04 IST)
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులను కనీసం ఆర్నెల్లపాటు వాయిదావేయాల్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. వీటికి భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ క్లారిటీ ఇచ్చారు. 
 
క్రెడిట్ కార్డు రుణాలు, బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని తెలిపారు. ఆ చెల్లింపులను నిబంధనల ప్రకారమే వినియోగదారులకు తప్పకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. టర్మ్ లోన్స్‌లో భాగంగావుండే... అంటే, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు వంటి వాటికి మాత్రమే ఈ కష్టకాలంలో ఊరట లభిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ ప్రకటనతో క్రెడిట్ కార్డుదారులు ఉసూరుమన్నారు. 
 
నిజానికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలకు ఊరట కలిగించే నిమిత్తం, బ్యాంకులకు రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్ కార్డు బకాయిలు ఉన్నవారు, వివిధ బ్యాకింగేతర ఆర్థిక సంస్థల నుంచి గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు తీసుకుని ఈఎంఐలు కడుతున్న వారంతా ఎంతో సంతోషించారు. కానీ, ఆర్బీఐ దీనిపై క్లారిటీ ఇవ్వడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు