ఎస్‌బీఐ నుంచి ఎస్‌సీవో పోస్టులు... రాతపరీక్షలు లేవు.. రూ.25 లక్షల నుంచి?

బుధవారం, 6 మార్చి 2019 (16:39 IST)
దేశంలోనే అత్యధిక ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ రిక్రూట్మెంట్ 2019 పేరిట స్పెషల్ కేడర్ ఆఫీసర్ (ఎస్‌సీవో)కు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షల ప్యాకేజీని.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే పొందవచ్చునని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
కాంట్రాక్ట్ ఆధారిత ఎస్‌సీవో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వేతనాలిచ్చే ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను మార్చి 24వ తేదీన ఎస్‌బీఐ స్వీకరించనుంది. అయితే ఈ పదవులకు రాతపరీక్షలు లేవని.. వట్టి ముఖాముఖితో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
 
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్ సైట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఎస్‌బీఐడాట్.కో.ఇన్ లేదా హెచ్‌టీటీపీఎస్://బ్యాంక్‌.ఎస్‌బీఐ/కెరీర్స్‌ను సంప్రదించవచ్చు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితితో పని లేదు. అర్హత, అనుభవాన్ని బట్టి నియామకాలుంటాయి. అంతేగాకుండా 28 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు గలవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఎస్‌బీఐ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు