ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీల ఖరారు..

బుధవారం, 6 మే 2020 (18:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించారు. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌, జూలై 24న ఈసెట్‌, 25న ఐసెట్‌ , ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న ఎడ్‌సెట్‌, ఆగస్టు 6న లాసెట్‌, ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈ సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.
 
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఐటీ, త్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడానికి జేఈఈ మెయిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఏప్రిల్‌ 5 నుంచి 11 వరకు నిర్వహించాలనకున్న జేఈఈ మెయిన్‌ వాయిదాపడ్డ సంగతి విదితమే. 
 
మే 17న నిర్వహించతలపెట్టిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సైతం వాయిదా పడింది. మే 3న జరగాల్సిన నీట్‌ను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆగస్టులో నిర్వహిస్తామని రమేష్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పది, 12వ తరగతి పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు