అమెజాన్‌లో జాబ్ మేళా : 50 వేల తాత్కాలిక ఉద్యోగాలు

శుక్రవారం, 22 మే 2020 (22:41 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధిని కోల్పోతున్నారు. దీంతో రోడ్డున పడుతున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో వేలాది మంది కొలువులు కోల్పోతున్నారు. చివరకు వలస కూలీలు, కార్మికులు కూడా రోజువారీ కూలీ పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అనేక కంపెనీలు ఆర్డర్లు లేక మూతపడుతుంటే.. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా జాబ్ మేళాను ప్రకటించింది. ఏకంగా 50 వేల తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించింది. లాక్డౌన్ వేళ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను తట్టుకుని నిలబడేందుకు తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ వార్త చాలా మంది నిరుద్యోగులకు ఇది శుభవార్తే. ముఖ్యంగా, లాక్డౌన్ సంక్షోభ సమయంలో ఉపాధి కోసం గాలిస్తున్న వారు ఈ అమెజాన్ ఇండియా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు