కర్ణాటక ప్రీమియర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులను తెరిచిన కొమెడ్‌కె

ఐవీఆర్

శుక్రవారం, 15 మార్చి 2024 (17:30 IST)
గత ఐదు దశాబ్దాలుగా  ఉన్నత విద్యలో అగ్రగామిగా కర్ణాటక నిలుస్తోంది. విభిన్న కళాశాలల శ్రేణి, అత్యుత్తమ రీతిలో విద్యాపరమైన అవకాశాలు, గ్రాడ్యుయేషన్‌ అనంతరం అధిక ఉద్యోగ నియామకాలు యొక్క విశేషమైన ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఇంజనీరింగ్‌లో కెరీర్ ను నిర్మించుకోవాలనుకునే వ్యక్తులకు ఇది ప్రాధాన్యత గమ్యస్థానంగా నిలిచింది. ఉన్నత విద్య పట్ల రాష్ట్రం యొక్క నిబద్ధత, గణనీయమైన నైపుణ్యం కలిగిన నిపుణుల సమూహాన్ని పెంపొందించింది, గణనీయమైన రీతిలో ప్రపంచ డిమాండ్‌ను ఆకర్షించింది.
 
కర్ణాటకలోని 150కి పైగా ఇంజినీరింగ్ కాలేజీలు, భారతదేశం అంతటా 50+ ప్రఖ్యాత ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం సంయుక్త పరీక్షగా COMEDK UGET, Uni-GAUGE ప్రవేశ పరీక్ష మే 12, 2024 ఆదివారం నాడు జరగనుంది. ఈ ఏకీకృత పరీక్ష కర్ణాటక అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అసోసియేషన్ (KUPECA)తో అనుబంధించబడిన కళాశాలలు, B.E/B.Tech ప్రోగ్రామ్‌లను అందించే Uni-GAUGE సభ్య విశ్వవిద్యాలయాల కోసం రూపొందించబడింది. ఈ ఆన్‌లైన్ పరీక్ష భారతదేశంలోని 200+ నగరాల్లో, 400+ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. ఈ ఏడాది 1,00,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని అంచనా వేస్తోంది. భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 01, 2024 నుండి ఏప్రిల్ 05, 2024 వరకు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు