ఏపీలో కరోనా విజృంభణ.. 2,618 మందికి కోవిడ్.. 16 మంది మృతి

ఆదివారం, 1 నవంబరు 2020 (17:45 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 88,780 నమూనాలను పరీక్షించగా 2,618 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,25,966కి చేరింది. 
 
ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 16 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 4, చిత్తూరు 3, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,706కి చేరింది.
 
24 గంటల వ్యవధిలో 3,509 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 23,668 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 81,17,685 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు