కరీంనగర్ స్కూల్లో 56 మంది విద్యార్థులకు కరోనా

సోమవారం, 12 అక్టోబరు 2020 (07:21 IST)
కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలలుగా మూతపడ్డ విద్యాసంస్థలను తెరిచేందుకు కేంద్రం నుండి అనుమతి లభించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
 
ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏకంగా 56మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారన్న వార్త అటు అధికారుల్లోనే కాదు ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తించింది.
 
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరుగురు టీచర్లు, 50మంది విద్యార్థుకు కరోనా సోకింది.
 
కొందరు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు పాఠశాలలోని మొత్తం 206మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు