విశాఖలో కరోనా కలకలం: ముగ్గురికి సోకిన కోవిడ్ కొత్త వేరియంట్

శనివారం, 23 డిశెంబరు 2023 (11:30 IST)
విశాఖపట్టణంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. విశాఖలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జలుబు, జ్వరం తదితర లక్షణాలున్నవారు, వళ్లు నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు అశ్రద్ధ చేయవద్దని సూచన చేస్తున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలనీ, ఇదివరకు కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలన్నీ తిరిగి పునఃప్రారంభించాలని చెబుతున్నారు.
 
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 27 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 752 కొత్త కేసులు నమోదు కాగా నలుగురు వ్యక్తులు మరణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు