లక్షకు చేరిన కరోనా వైరస్ సంక్రమణ కేసులు.. భారత్‌లో 31

శనివారం, 7 మార్చి 2020 (12:12 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఈ వైరస్ సోకుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలోని 90 దేశాలలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 3500కి పెరిగింది. 
 
చైనాలో ఇప్పటివరకు 80,552 కరోనా కేసులు నమోదుకాగా, ఇందులో 3,042 మంది మృతి చెందారు. చైనా బయట మొత్తం 17,571 కేసులు నమోదవగా.. అందులో వైరస్ కారణంగా 343 మంది మరణించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు సగానికి పైగా కోలుకున్నారు. భారతదేశంలో కరోనాతో బాధపడుతున్న రోగుల సంఖ్య శుక్రవారం(07 మార్చి 2020) నాటికి 31కి చేరుకుంది. 
 
చైనా తర్వాత కరోనా ఎక్కువగా ప్రభావితమైన దేశాలు దక్షిణ కొరియాలో 6,284 కేసులు, 42 మరణాలు నమోదుకాగా, ఇటలీ (3,858 కేసులు, 148 మరణాలు), ఇరాన్ (3,513 కేసులు, 107 మరణాలు), ఫ్రాన్స్ (423 కేసులు, ఏడు మరణాలు). గురువారం నాటికి, పాలస్తీనా మరియు భూటాన్లలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు