కరోనా వైరస్ విలయతాండవం.. మరో రికార్డు.. 50వేలు దాటింది..

గురువారం, 30 జులై 2020 (11:11 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 775 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు చేరింది.
 
భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 45వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కేసుల సంఖ్యపరంగా తాజాగా మరో రికార్డు నమోదైంది. గత 24 గంటల్లో 52,123 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులు ఒక్క రోజులో 50వేలు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు