జ్వరం, దగ్గు, జలుబు.. వామ్మో నాకు కరోనావైరస్ వచ్చేసిందేమో? పరిశోధకుల సూచనలు

సోమవారం, 27 జులై 2020 (10:35 IST)
కరోనావైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అది తమకు సోకుతుందో, సోకిందేమోనన్న భావన ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళితే కరోనా సోకిందేమోనని అది తమ కుటుంబ సభ్యులను వెంటాడుతుందేమోనని భయాందోళన అందరిలో మొదలయ్యింది. ప్రముఖ వైద్యులు, ప్రభుత్వాలు రోజుకో మాట, ప్రచారాలు చేస్తున్నాయి. ఈ వైరస్ గురించి ఎక్కడా ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.
 
ఇది సోకిందంటే మరణం తప్పదని, దీని బారి నుండి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవని మేధావులు వెల్లడిస్తున్నారు. ఇటీవలే అమెరికా సైక్రయాట్రిస్ట్ అసోషియేషన్ దీనిపై పరిశీలన జరిపింది. కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి కంటే ఆందోళన తీవ్రమయ్యిందని స్పష్టం చేసారు. ఇంతకీ పరిశోధకులు ఏంచెబుతున్నారో చూద్దాం.
 
1. కరోనావైరస్ సోకిన వారికంటే తమకు సోకందేమోననే వారు ఎక్కువ.
 
2. ఆందోళన, భయం, ఒత్తిడి వంటివి సామాజిక వ్యాప్తికి కారణం.
 
3. అనవసర ఆందోళన కారణంగా ఆరోగ్యవంతులు కూడా రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు.
 
3. పాశ్చత్య దేశాల కంటే ఆసియా దేశాలలో ఇలాంటి ఆందోళనలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి.
 
4. యువకుల్లోనూ ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
5. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండే వృద్ధులు త్వరగా కోలుకుంటున్నారు.
 
6. కరోనా భయం లేకుండా ధైర్యంగా ఉండటమే దీనికి సరైన మందంటున్నారు పరిశోధకులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు