శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ వృధా: బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (23:41 IST)
India vs Bangladesh
ఆసియా కప్ సూపర్ - 4 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్ మన్ గిల్ సెంచరీతో మెరిసినా ఫలితం లేకపోయింది.  చివరి ఓవర్లో 12 పరుగులు కొడితే విజయం దక్కుతుందనగా.. క్రీజులో వుండిన షమీ బంతులను వృధా చేయడంతో ఈ మ్యాచ్ ఫలితం ఓటమిగా మారిపోయింది. నాలుగో బంతిని ఫోర్‌గా మలిచి.. డబుల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. దీంతో ఛేదనలో 49.5 ఓవర్లలో 259 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. 
 
అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. తదనంతరం బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో 133 బంతుల్లో 121 పరుగులు చేసిన గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో అక్షర్ పోరాడాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో భారత్ పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్‌ను విజయం వరించింది. 
 
భారత ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ 26, అక్షర్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 3, టాంజిమ్ హసన్ సకీబ్ 2, మహెదీ హసన్ 2, మెహెదీ హసన్ మిరాజ్ 1, కెప్టెన్ షకీబల్ హసన్ 1 వికెట్ తీశారు. సూపర్-4లో బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇక, ఈ నెల 17న జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు