మగశిశువుకు జన్మనిచ్చిన నటాషా.. మేము తల్లిదండ్రులమయ్యాం.. హార్దిక్

గురువారం, 30 జులై 2020 (18:12 IST)
Baby boy
క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. సెర్బియన్ మోడల్, నటి నటాషా స్టాన్‌కోవిక్‌తో పాండ్యా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమకు ఓ మగబిడ్డ జన్మించినట్లు హార్ధిక్ వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. కొడుకు చేతులను ప్రేమగా పట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు. 'మేము తల్లిదండ్రులమయ్యాం' అంటూ దానికి కాప్షన్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా.
 
ఇదిలా ఉంటే గతేదాడి నుంచి వెన్నునొప్పి కారణంగా హార్దిక్ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 105 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన పాండ్యా 1,799 పరుగులు చేశాడు. 109 వికెట్లు తీశాడు. దీంతో విలువైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. జనవరిలో నటి నటాషాతో పాండ్యా నిశ్చితార్థం జరిగింది.
Hardik pandya


కానీ ఇంతలో నటాషా గర్భం దాల్చినట్లు ప్రకటించాడు. ఆపై హార్దిక్, నటాషా దంపతులకు బాబు పుట్టాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు