రైనా లేకపోవడం.. ధోనీకి మంచి అవకాశం: గంభీర్‌

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (09:11 IST)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా లేకపోవడం వల్ల ధోనీకి మంచి అవకాశం దక్కినట్లయిందని భారత మాజీ ఓపెనర్‌, ప్రస్తుత బిజెపి ఎంపి గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని ఫస్ట్‌ డౌన్‌లో ఆడించాలని సూచించాడు. 'నెంబర్‌ 3లో బ్యాటింగ్‌ చేయడానికి ధోనీకిదే సువర్ణావకాశం.

ఒక వేళ ధోనీ మూడో స్థానంలో వచ్చినా.. కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రావో, సామ్‌ కరన్‌లతో లోయరార్డర్‌ బలంగా ఉంటుంది. కాబట్టి ధోనీ వంటి ఆటగాడికి ఇది గొప్ప అవకాశమని నా అభిప్రాయం. అతను కూడా ఈ స్థానంలో ఆడటాన్ని ఆస్వాదిస్తాడని అనుకుంటున్నా' అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు