క్రికెట్ చరిత్రలో తొలి కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్ ఎవరో తెలుసా?

బుధవారం, 21 అక్టోబరు 2020 (18:53 IST)
ప్రపంచ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన బెన్ లిస్టర్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. క్రికెట్ చరిత్రలో తొలి కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఖ్యాతికెక్కారు. 
 
ప్రస్తుతం దేశవాళీ టోర్నీ ప్లంకెట్‌ షీల్డ్‌ ఫస్ట్‌క్లాస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న ఆల్‌రౌండర్‌ మార్క్‌ చాప్‌మన్‌ స్థానంలో లిస్టర్‌.. ఆక్లాండ్‌ జట్టులోకి వచ్చాడు. చాప్‌మన్‌ కోవిడ్‌-19 పరీక్ష చేయించుకోవడం కోసం వెళ్లడంతో అతని స్థానంలో లిస్టర్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ 26 యేళ్ళ చాప్‌మన్‌కు కరోనా నెగెటివ్ అని తేలడంతో అతను మళ్లీ వచ్చి జట్టులో కలిశాడు. 
 
కాగా, న్యూజిలాండ్‌ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడిన చాప్‌మన్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కొవిడ్‌ సబ్‌స్టిట్యూట్‌ నిబంధనలను ఐసీసీ గత జూన్‌లో ఆమోదించిన విషయం తెలిసిందే. 
 
ఆటగాళ్లు అనారోగ్యం బారినపడిన లేదా కోవిడ్‌-19 లక్షణాలు కనిపిస్తే వాళ్ల స్థానంలో మరొక ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్లేయర్‌కు కరోనా ఫలితం నెగెటివ్‌గా తేలితే మళ్లీ జట్టులోకి రావొచ్చు. లేనిపక్షంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను కొనసాగించవచ్చు. అయితే, ఇపుడు బెన్ లిస్టర్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా రికార్డు కెక్కాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు