టీమిండియా జెర్సీ రంగు మారుతోంది... సింహభాగం కాషాయం రంగులోకి...

ఠాగూర్

మంగళవారం, 7 మే 2024 (10:26 IST)
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్లను రిజర్వు బెంచ్ కోసం ఎంపిక చేసింది. అయితే, ఈ టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించనున్నట్టు తెలుస్తుంది. 
 
ఈ మేరకు బీసీసీఐ నూతన జెర్సీల ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేయగా, వాటిని క్రికెట్ అభిమానులు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ రంగులో ఈ జెర్సీ ఉంది. ఇదే రకం జెర్సీని టీమిండియా ఆటగాళ్ళు 2019 వరల్డ్ కప్ సమయంలోనూ ధరించారు. ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేటపుడు టీమిండియా వేర్వేరు జెర్సీ ధరిస్తూ వస్తుంది. మరి ఈసారైనా కొత్త జెర్సీ లక్ తెలుస్తుందేమో చూడాలి. 2011 తర్వాత టీమిండియా ఏ ఐసీసీ ఈవెంట్‌లోనూ నెగ్గలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు