జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్న యువతి.. నా చావుకు ఎవరూ కారణం కాదు..

శనివారం, 26 ఆగస్టు 2023 (13:05 IST)
జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పైగా, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది. లాడ్జీలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా వందనపల్లి గ్రామానికి చెందిన రమేష్ కృష్ణ (25) అనే యువతి విశాఖలోని డాబాగార్డెన్స్‌ భానువీధిలో ఉన్న వాస్తు ఇన్‌ లాడ్జికి ఈ నెల 23వ తేదీన వచ్చి, మధ్యాహ్నం 12 గంటలకు ఓ గదిని అద్దెకు తీసుకుంది. 24వ తేదీ రాత్రి వరకు ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది... తలుపులు కొట్టారు. అయితే, ఆమె ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
 
వెంటనే అక్కడకు చేరుకున్న రెండో పట్టణ పోలీసులు గది తలుపులు తీయగా ఆమె ఫ్యాను హుక్కుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఘటన స్థలంలో ఆత్మహత్య లేఖను పోలీసులు గుర్తించారు. అందులో తనకు జీవితంపై విరక్తి కలిగిందని, తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్‌ చదవడానికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె విశాఖ ఎందుకు వచ్చింది.. ఇక్కడ ఉరేసుకోవడానికి కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు