ఓనం పండుగను కేరళ ప్రజలు.. బలి చక్రవర్తి కోసమే జరుపుకుంటారు..

గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:36 IST)
Onam
కేరళను మహాబలి అంటే బలిచక్రవర్తి పాలించినట్లు చెప్తారు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా వుండేవారని చెప్తారు. ఆయన రాక్షస వంశానికి చెందినప్పటికీ ఆయనలో వున్న దానం, దయాగుణం ప్రజలను సంతోషపరిచింది. మహాబలి కేరళను పరిపాలించినప్పుడు ప్రజల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. 
 
మహాబలి గౌరవార్థం కేరళ ప్రజలు ఓనం పండుగను ఆనందంగా వైభవంగా జరుపుకుంటారు. మహాబలికి మరో రెండు పేర్లు ఉన్నాయి. ఒనతప్పన్, మావెలి.
 
కేరళ మహాబలి రాక్షసుడిచే పాలించబడింది. మహాబలి పాలించినప్పుడు కేరళ కీర్తి ప్రతిష్టలతో పాటు ఎన్నో విజయాలను చూసింది. రాష్ట్రంలో ఎవరూ కూడా విచారంగా లేరు. ధనిక, పేద అనే తేడాలు లేవు. నేరం, అవినీతి లేదు. దొంగతనానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే రాత్రి తలుపులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. 
 
ప్రజలలో మహాబలిరాజు చాలా ప్రాచుర్యం పొందాడు. పేద ప్రజలకు ఆయన తక్షణమే సాయం చేశాడు. అయితే శ్రీమహావిష్ణువు వామనుడి అవతారంలో ఆయన వద్ద దానంగా మూడు అడుగుల స్థలం కోరిక కథ అందరికీ తెలిసిందే. వచ్చింది విష్ణువని తెలిసీ.. తనకు అంతం ఖాయమని తెలిసీ.. తన గురువైన శుక్రాచార్యుడు చెప్పినా.. పట్టించుకోకుండా విష్ణువుకు దానం ఇచ్చిన ఘనుడు బలి చక్రవర్తి. 
 
విష్ణువు వామనుడి అవతారంలో నిస్సహాయ బ్రాహ్మణుడిగా మారువేషం వేసి భూభాగాన్ని చేరుకుంటాడు. బలి తలపై కాలెట్టి ఆయనను తన వశం చేసుకుంటాడు. ఆ సందర్భంగా విష్ణువు బలికి ఒక వరం ఇచ్చాడు. తన ప్రజలను చూడటానికి ప్రతి సంవత్సరం తన రాష్ట్రానికి రావడానికి అనుమతి ఇస్తాడు. 
 
తద్వారా బలి ప్రతి సంవత్సరం కేరళ సందర్శించే రోజునే ఓనంగా జరుపుకుంటారు. ఈ పండ పండుగ ప్రధానంగా ఆ రాజును గౌరవించటానికి, మహాబలికి స్తుతించడం కోసం జరుపుకోబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు