కొత్త శ్రేణి వాటర్ ప్యూరిఫైయర్లను ప్రారంభించిన హల్స్ ప్యూరిట్

గురువారం, 27 అక్టోబరు 2022 (23:06 IST)
హల్స్ ప్యూరిట్, తన కొత్త శ్రేణిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫిల్ట్రా పవన్ టెక్నాలజీతో కూడిన కొత్త శ్రేణి ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ మినరల్స్ ఆధారిత వాటర్ ప్యూరిఫైయర్‌లు, పారిశ్రామిక రసాయనాలు, పురుగుమందులు వంటి విషపదార్థాలను వ్యాధికారకాలను తొలగిస్తాయని, సురక్షితమైన త్రాగునీటిని అందిస్తాయని నిరూపితమైంది. ఇది కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రయోగశాలలచే పరీక్షించబడుతుంది. ఈ శ్రేణి, నీటి రికవరీ మరియు శుద్దీకరణ వేగంలో అత్యుత్తమ పనితీరుతో టర్బోచార్జ్ చేయబడింది. ఈ పరికరం అనేక సౌకర్యవంతమైన మరియు లగ్జరీ ఫీచర్లని కలిగి ఉంది.
 
ఆవిష్కరణ సమయంలో వ్యాఖ్యానిస్తూ, హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ హోమ్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ సుబ్రమణియన్ ఇలా అన్నారు, “నీటి కాలుష్యం, కుటుంబ ఆరోగ్యం ఈ వర్గానికి ప్రధాన ట్రిగ్గర్లుగా వినియోగదారుల అధ్యాయనాలు తరచుగా నొక్కి వక్కాణిస్తున్నాయి. సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి, విష పదార్థాలను తొలగించడానికి ఈ అంశాన్ని ప్రధానంగా ఉంచుతూ ప్యూరిట్ వైటల్ సిరీస్ రూపొందించబడింది.”
 
గ్లోబల్ సీఈఓ వాటర్ అండ్ ఎయిర్ వెల్నెస్, మిస్టర్ హెంక్ ఇన్ ’టి హాఫ్, వ్యాఖ్యానిస్తూ, "ప్యూరిట్, ప్రపంచ స్థాయి నీటి శుద్దీకరణలో మా నైపుణ్యం మరియు స్థానిక అంశాలను ఉపయోగించుకుని ప్రపంచ స్థాయి ఇంకా భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అందజేస్తుంది. సరసమైన ధర పరిధిలో అధిక-పనితీరు మరియు అధిక-నాణ్యత ఉత్పత్తిని అందించడమే మా ఉత్పత్తి రూపకల్పన  బృందం యొక్క ముఖ్య లక్ష్యం", అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు