బుధవారం మరకతమణిని ధరిస్తే..? శనిగ్రహ దోషాలు పరార్ (video)

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (05:00 IST)
బుధ దశ జాతకంలో జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తే.. అలాగే ఆశ్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు, విద్యలో ఆటంకాలు ఉన్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు, మందబుద్ధి కలవారు మరకతమణిని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

మరకతమణి ధరించేటప్పుడు ''మహాదేవచ్చ విద్మహే విష్ణు పత్నేచ్చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపిస్తూ పచ్చ రత్నాన్ని చిటికెన వ్రేలుకు గాని, ఉంగరపు వేలుకు గాని ధరించాలి. బుధవారం రోజు బుధహోరలో పచ్చ పెసర్లను ఒక కిలో పావు దానం చేయడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
పచ్చ బుధగ్రహానికి సంబంధించినది కావున జ్ఞాన శక్తికి, మానసిక ప్రశాంతతకు, వ్యాపారాభివృద్ధికి, ఉన్నత విద్యలను అభ్యసించుటకు విష్ణుమూర్తి ప్రతి రూపమైన పచ్చను ధరించాలి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించును. పచ్చరత్నాన్ని ధరించిన క్రీడలలో నైపుణ్యాన్ని, బుద్ధి వికాసానికి కారణమవుతుంది. 
 
 
అలాగే ఇతరుల ముందు సులభంగా భావాలను వ్యక్తపరచటం, అవతలి వ్యక్తులు ఏది చెబితే విని అర్ధం చేసుకోగలరో అది చెప్పగలిగే వాక్ శుద్ధిని కలిగిస్తుంది. మంచి తెలివితేటలతో వాదోపవాదనలు చేయగలరు. రావణాసురుడు పెద్ద మరకత మణి పైన కూర్చోని భగవంతుని ద్యానం చేసేవాడట.
 
అలాగే నలమహారాజు శనిగ్రహ పీడా విముక్తికి విష్ణుమూర్తిని ప్రార్థించి శివలింగంను ప్రసాదించమని కోరగా మరకత లింగమును ప్రసాదించాడు. నలుడు ప్రతిష్టించిన మరకత లింగం పాండిచ్చేరి రాష్ట్రంలో కలదు. శ్రీకృష్ణ దేవరాయలు సింహాచలంలో స్వామి వారికి శ్రేష్ఠమైన పచ్చలను ఇవ్వటం జరిగింది. గరుత్మంతుని ద్వారా ఉద్భవించిన గరుడ పచ్చలు అమిత శక్తి వంతమైనవని పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు