అధిక బరువు- ఊబకాయంతో వచ్చే జబ్బులు ఏమిటో తెలుసా?

సిహెచ్

బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (11:54 IST)
అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బొద్దుగా వుంటే మంచిది అనుకుంటారు కానీ ఎత్తు తగిన బరువుకి మించి వుంటే అది అనారోగ్యానికి మూలకారణం అవుతుంది. అధికబరువు తెచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.
 
శరీర అదనపు బరువు మధుమేహం 2 ప్రమాదాన్ని పెంచుతుంది.
గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలు అధికబరువు వల్ల వస్తాయి.
అధిక రక్త కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సమస్యలు వస్తాయి.
అధిక రక్తపోటు వ్యాధి వస్తుంది.
మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధికి మూలకారణం ఇదే అవుతుంది.
కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం వుంటుంది.
గర్భంతో సమస్యలు తలెత్తవచ్చు.
కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు అధిక బరువు కారణం కావచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు