మంచినీళ్లు తాగే తీరిక కూడా లేదంటుంటారు కొంతమంది... కానీ...

సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:10 IST)
ఇటీవలి బిజీ లైఫ్‌లో కనీసం మంచినీళ్లు తాగే తీరిక కూడా లేదంటుంటారు కొంతమంది. కానీ శరీరానికి నీరు అందకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. నీటిని తాగకపోతే ఏం జరుగుతుందో ఓసారి తెలుసుకుందాం..
 
1. డీహైడ్రేహన్ కలుగుతుంది. మలబద్ధకం ఏర్పడి సతమతం చేస్తుంది.
2. తలనొప్పి, అలసట, ఆందోళన, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 
3. మూత్రవిసర్జన తగ్గుతుంది. ఒక్కోసారి ఆగిపోనూవచ్చు. కండరాల నొప్పులు, బలహీనత, కాళ్లు చేతులు చల్లబడటం వంటివి జరుగుతాయి. 
4. చర్మం పొడిబారుతుంది. కాంతి విహీనంగా మారుతుంది. నోరు పొడిబారుతుంది. అజీర్ణం వలన అనేక జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి.
5. మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పి కలుగుతాయి. మూత్రవిసర్జన సక్రమంగా జరగకపోవడం వలన రక్తంలో మలినాలతో నిండిపోతుంది. శరీరంలోని విషపదార్థాలు విసర్జింపబడక శరీరంలోనే పేరుకుపోతాయి.
6. వయసు పెరిగేకొద్దీ దాహం తగ్గుతుంది. అలా అని నీరు తాగాలని లేకపోయినా నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తగ్గకుండా తాగాలి. 
7. అధిక రక్తపోటు, ఆస్త్మా, విపరీతమైన వంటి నొప్పులకు మూలకారణం నీటి సరఫరా తగినంత లేకపోవడమేనని వైద్యులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు