పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

సిహెచ్

గురువారం, 25 ఏప్రియల్ 2024 (19:39 IST)
ప్రెగ్నెన్సీ కాకుండా, పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలు అనారోగ్యానికి సూచక అయ్యే అవకాశం వుంటే మరికొన్ని వివిధ సమస్యల వల్ల తలెత్తే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు.
అధిక ఒత్తిడి హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది.
జ్వరం, జలుబు, దగ్గు మొదలైన వ్యాధుల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి.
దినచర్యలో మార్పులు పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణం కావచ్చు.
గర్భనిరోధక మాత్రలు, కొన్ని ఇతర మందులు కూడా దీనికి కారణం కావచ్చు.
ఊబకాయం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు.
తక్కువ బరువు లేదా సన్నగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
థైరాయిడ్ సమస్య ఉంటే పీరియడ్స్ ఆలస్యంగా రావచ్చు.
పాలిచ్చే స్త్రీలకు కూడా ఈ సమస్య రావచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు