పుచ్చకాయ తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

సిహెచ్

శనివారం, 9 మార్చి 2024 (19:29 IST)
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది.
మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది.
మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది.
పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
పుచ్చకాయ తినడం వలన మగవారిలో శృంగార సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి.
వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 
గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్‌ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి.
గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గించి, జీవక్రియకు సజావుగా జరుగుటలో పుచ్చకాయ సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు