గ్రీన్ కాఫీ బీన్స్‌తో 2 నెలల్లోనే బరువు తగ్గొచ్చట.. నిజమేనా?

సోమవారం, 15 మే 2017 (13:32 IST)
గ్రీన్ కాఫీ బీన్స్‌తో రెండు నెలల్లోనే బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం ఇటీవల నిర్వహించిన సర్వేల్లో కూడా తేలిందని వారు చెప్తున్నారు. ఊబకాయంతో బాధపడేవారు.. రోజూ ఓ గ్లాసుడు గ్రీన్ కాఫీ బీన్స్‌తో కూడిన పానియాన్ని సేవిస్తే మంచి ఫలితం లభిస్తుందట. ఇంకా గ్రీన్ కాఫీ బీన్స్ పానీయాలను సేవించే 96. 7శాతం మంది ప్రజలు 12-17 కిలోల వరకు మూడు వారాల్లోనే బరువు తగ్గారని తేలింది. 
 
బరువు తగ్గడం కోసం జిమ్‌ల వెంట పడటం.. ఆయిల్ పదార్థాలను వాడకం తగ్గించడం వంటివి చేయడం కంటే గ్రీన్ కాఫీ బీన్స్‌తో పానియం తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గ్రీన్ కాఫీల్లోని క్లోరోజెనిక్ యాసిడ్స్, యాంటీయాక్సిడెంట్ ఎఫెక్ట్స్ లోబీపీని నియంత్రించి.. బరువును తగ్గించడంలో సహకరిస్తాయి. వేయించిన గ్రీన్ కాఫీ బీన్స్ ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చునని, అయితే రోజుకు 60 నుంచి 185 మి.గ్రాముల వరకే ఈ గ్రీన్ కాఫీ బీన్స్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇకపోతే.. గ్రీన్ కాఫీ బీన్స్ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రించడంలో మెరుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి