వేరుశెనగ తింటే యవ్వనంగా వుంటారు, ఎలా?

శుక్రవారం, 14 అక్టోబరు 2022 (22:13 IST)
చర్మ సౌందర్యం, యవ్వనాన్ని పెంచడానికి వేరుశెనగ గింజలను తినండి. నానబెట్టిన వేరుశెనగ గింజలను తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. వేరుశెనగ తింటే చర్మం బిగుతుగా మారుతుంది. వేరుశెనగ గింజలు తినడం వల్ల చర్మం ముడతలు తొలగిపోతాయి.

 
వేరుశెనగ గింజలను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి పోగొట్టుకోవచ్చు. వేరుశెనగలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మం మంటను తగ్గిస్తాయి. వేరుశనగలను వేయించి, తేనెతో కలిపి తీసుకుంటే మొటిమల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 
సోరియాసిస్‌, ఎగ్జిమా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే వేరుశెనగలు తింటుండాలి. ఏదైనా ఆరోగ్య చిట్కా ఆచరించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు