చిక్కుడు తాలింపు.. బరువును పెంచుతుందా?

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:55 IST)
చిక్కుడు తాలింపుతో బరువు పెరగరు. చిక్కుడు కాయ బరువును తగ్గిస్తుంది. రోజూ ఓ కప్పు చిక్కుడు తాలింపును తీసుకుంటే కొలెస్ట్రాల్ దరిచేరదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

చిక్కుడు శరీరంలో కొవ్వు చేరకుండా చేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది. చిక్కుడులోని ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలకు చెక్ పెడుతుంది. 
 
చర్మ వ్యాధులు, నొప్పులను తగ్గిస్తుంది. దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తుంది. కరిగిపోయే పీచును ఫైబర్‌ను కలిగివున్న చిక్కుడు చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా చేస్తుంది. చిక్కుడులో ఐరన్, కాపర్ రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతాయి. 
 
అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌ను తగ్గిస్తుంది. ఇందులో అధిక ప్రోటీనులు, డైటరీ ఫైబర్‌ బరువు తగ్గిస్తుంది. ఇంకా చిక్కుళ్లలోని ఐరన్ రక్తనాళాలకు కావలిసినంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు