గోరు వెచ్చని నీటిని ఎలా తాగాలి..? ఎప్పుడు తాగాలి..?

బుధవారం, 27 జనవరి 2021 (19:27 IST)
గోరువెచ్చని నీటిని పరగడుపున తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉదయం పూట ఐదు గంటలకు నాలుగు గ్లాసులు లేదా చెంబు గోరు వెచ్చని నీటిని సేవించాలి. తర్వాత 45 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు. 4 గ్లాసులు తీసుకుంటే తొలుత ఒక గ్లాసు తర్వాత రెండు గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి. 
 
గోరు వెచ్చని నీరు తాగడం ద్వారా 30 రోజుల్లో బీపీ నియంత్రణలో వుంటుంది. ఉదర సంబంధిత రుగ్మతలు పది రోజుల్లో నయం అవుతాయి. అన్నీ రకాల క్యాన్సర్లు 9 నెలల్లో దూరమవుతాయి. నరాల్లోని బ్లాకులు శుద్ధీకరింపబడుతాయి. 
 
మూత్ర సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలకు రుతుక్రమం ఇబ్బందులుండవు. గుండె సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. తలనొప్పి/మైగ్రేమ్ తలనొప్పి తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్, ఆస్తమా, హైబీపీ వంటివి దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు