శొంఠిని పెరుగన్నంలో కలుపుకుని తీసుకుంటే? (Video)

సోమవారం, 23 మార్చి 2020 (15:08 IST)
ఆయుర్వేదంలో శొంఠిని మించిన మందు లేదు. ఉదయం అల్లం, మధ్యాహ్నం శొంఠి, రాత్రి కరక్కాయ అనే మూడింటిని డైట్‌‍లో చేర్చుకుంటే.. అనారోగ్యాలు దరిచేరవు. అజీర్తికి శొంఠి ఎంతో మేలు చేస్తుంది. ఇది వ్యర్థాలను తొలగిస్తుంది. అన్నవాహికను శుభ్రపరుస్తుంది. శొంఠితో పాలును చేర్చి మరిగించి తీసుకుంటే.. మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. 
 
పిత్త సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. శొంఠిని నిమ్మరసంతో కలిసి తీసుకుంటే ఉఫశమనం లభిస్తుంది. శొంఠి, మిరియాలు, ధనియాలు, పిప్పళ్లు చేర్చి కషాయంలా మరిగించి మూడు రోజుల పాటు తీసుకుంటే జలుబు మాయం అవుతుంది. పెరుగు అన్నంతో కాసింత శొంఠిని చేర్చి తీసుకుంటే.. కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. 
 
శొంఠి, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, వేపాకును కషాయంలా తయారు చేసుకుని రోజూ మూడు పూటలా తీసుకుంటే రెండు రోజుల్లో వైరల్ ఫీవర్ పారిపోతుంది. శొంఠి, మిరియాలు, జీలకర్రను నువ్వుల నూనెలో మరిగించి మాడుకు రాయాలి. పావు గంట తర్వాత స్నానం చేస్తే.. పేలు తొలగిపోతాయి. శొంఠి, ఉప్పుతో దంతాలను శుభ్రం చేస్తే పంటి నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు