అప్పడాలు తింటే ఆరోగ్యము, అలా తింటే అనారోగ్యం కూడా

బుధవారం, 26 జులై 2023 (22:11 IST)
అప్పడాలు. భోజనంతో పాటు సైడ్ డిష్‌గా వీటిని కరకరమంటూ తింటుంటారు. అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి. జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.
 
అప్పడాలలో ఉప్పు అధికం, కనుక ఇది రక్తపోటు- గుండె జబ్బులకు ప్రధాన కారణమౌతుంది. అప్పడాలను వేయించడానికి పదేపదే ఉపయోగించే నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అప్పడాలను తినరాదు.
 
అప్పడాలను మైక్రోవేవ్‌లో కాల్చినప్పుడు, అక్రిలమైడ్, ఆల్కలీన్ ఉప్పు కంటెంట్ కారణంగా క్యాన్సర్ కారక పదార్థం ఏర్పడుతుందని పరిశోధన రుజువు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు