ఆంధ్రప్రదేశ్‌లో "ఆ" టాయ్స్ అమ్మకాల జోరు - తెలంగాణాలో మహిళలే టాప్

శనివారం, 25 జులై 2020 (09:42 IST)
ఇపుడు ప్రతి ఒక్కరినీ కష్టాలు చుట్టుముట్టివున్నాయి. అనేకమంది ఉపాధిని కోల్పోయారు. మరికొందరికి కొలువులు ఉన్నప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఒకవైపు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటే... మరోవైపు సెక్స్ టాయ్స్ అమ్మకాలు కూడా రెట్టింపు అయినట్టు ఓ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో తేలింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
కరోనా వైరస్ కారణంగా సామాజిక భౌతికదూరం పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీంతో భార్యాభర్తలు కూడా శారీరకంగా కలుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇక టీనేజ్ యువత లాక్డౌన్ కారణంగా ఒంటరి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారంతా కృత్రిమ వస్తువులతో తమ కామ వాంఛలను తీర్చుకుంటున్నారు. 
 
దట్స్‌ పర్సనల్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ వెల్లడించిన వివరాల మేరకు... ఇండియా అన్‌కవర్డ్‌ పేరిట లైంగిక ఉత్పత్తులపై విశ్లేషణ చేస్తూ ఈ సంస్థ ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం, మగవారితో పోలిస్తే మగువలే ఎక్కువగా సెక్సువల్‌ టాయ్స్‌ కోసం ఆర్డర్‌ చేస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా తొమ్మిది చిన్న నగరాల్లో వీటి కోసం మహిళల ఆర్డర్లు 300 శాతం వృద్ధి చెందాయి. ఈ నగరాల్లో విజయవాడ ఉండటమే కాకుండా అగ్రస్థానంలో నిలిచింది. వయసుల వారీగా చూస్తే 25-34 ఏళ్ల వయసు విభాగంలో 61 శాతం మంది మళ్లీ మళ్లీ ఉత్పత్తుల కోసం ఆర్డర్లు చేస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా అత్యధికంగా సెక్స్‌టాయ్స్‌ కొంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. తెలంగాణలో పురుషులకన్నా మహిళలే ఎక్కువగా సెక్స్‌టాయ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాలపరంగా దేశంలో ఆరోస్థానంలో హైదరాబాద్‌ ఉంది.
 
సాధారణంగా పురుషులు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకూ సెక్స్‌టాయ్స్‌ కొనుగోలు చేస్తుంటే, మహిళలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ కొంటున్నారు. పురుషులు మేల్‌ పంప్‌ కోసం ఎక్కువ ఆర్డర్లు చేస్తుండగా.. మహిళలు మసాజర్‌ కోసం ఆర్డర్‌ చేస్తున్నారు.  
 
ఈ సెక్స్‌టాయ్స్‌ని పెళ్లి కాని, ఒంటరిగా ఉంటున్న వారు, పెళ్లయిన వారు కొంటున్నారు. వాడిన తర్వాత ఆనందం పొందామని 86శాతం పెళ్లయిన మగవారు, 89 శాతం మంది మహిళలు చెబుతుంటే.. పెళ్లికాని అబ్బాయిలు 71 శాతం మాత్రమే సంతృప్తి పొందామంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు