స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

సిహెచ్

శుక్రవారం, 3 మే 2024 (19:52 IST)
స్ట్రాబెర్రీలు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
స్ట్రాబెర్రీలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తాయి.
వీటిలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తాయి
స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చని అధ్యయనంలో తేలింది.
నలుపు రంగులు బెర్రీ పండ్లను తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలు దూరమౌతాయి.
స్ట్రాబెర్రీలు తింటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి, ఆర్థరైటీస్ బారిన పడకుండా కాపాడుతుంది.
టైప్ 2 డయాబెటిస్, గుండె ఆరోగ్య సమస్యలను నివారించడానికి స్ట్రాబెర్రీ సహాయపడుతుంది.
ఈ పండ్లు జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి.
పొట్టలో ఏర్పడే అల్సర్‌కు స్ట్రాబెర్రీలు తింటుంటే అడ్డుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు