శీతాకాలంలో ఎలాంటి నీటిని తాగాలి... ప్రయోజనం ఏంటి?

బుధవారం, 19 డిశెంబరు 2018 (18:39 IST)
సాధారణంగా ప్రతి జీవికి నీరు తప్పనిసరిగా కావాలి. నీరు లేకుండా ఏ జీవి బ్రతుకలేదు. ఇంత అధ్బుతమైన శక్తిని కలిగిన నీటి వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ నీటిని తాగడానికి చాలామంది ఇష్టపడరు. దీని వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక తప్పనిసరిగా ప్రతిరోజు 5 లేదా 6 లీటర్ల నీటిని త్రాగాలి. ముఖ్యంగా వేడి నీటిని తాగడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
 
1. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగేవారిలో జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం, పైల్స్ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
 
2. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి, త్వరగా బరువు తగ్గుతారు.
 
3. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల జీవ ప్రక్రియలన్నీ సజావుగా సాగుతాయి.
 
4. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు వేడినీరు తాగడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 
 
5. వేడినీరు తాగడం వల్ల 'కేంద్ర నాడీ వ్యవస్థ' పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. చర్మానికి, వెంట్రుకలకు కూడా చాలా మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు