నెలసరి సమయంలోనూ శృంగారం కావాలని గొడవ చేస్తున్నాడు... ఎలా?

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (20:19 IST)
కొందరు మహిళలు నెలసరి సమయంలోనూ తమ భర్తల నుంచి శృంగారపరమైన సమస్యలను ఎదుర్కొంటుంటారు. మరికొందరు భర్తలు మాత్రమే తమ భార్యల పరిస్థితిని అర్థం చేసుకుని నెలసరి సమయంలో రతి క్రియకు దూరంగా ఉంటారు. ఐతే కొంతమంది భర్తలు భార్య నెలసరిలో వున్నా శృంగారం చేయాల్సిందేనంటూ పట్టుబడుతారు. ఇది భార్యలకు తీవ్ర చికాకు, భర్తల పట్ల అసహ్యం, అసహనాన్ని రేకెత్తిస్తుంది. 
 
పలువురు మహిళలు అయితే, తమ భర్తలను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోవాలని భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కాదని మగవారు భావిస్తుంటారు. అయితే, ఈ సమయంలోనే స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతారు. 
 
దాంతో పాటుగా, తీవ్రమైన కడుపునొప్పి, నడుము నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావం కారణంగా నీరసంలాంటివి ఉంటాయి. ఈ సమయంలో ఇంటి పని - వంట పనిలో భర్త షేర్ చేసుకోవడమే కాదు మానసికంగా కూడా ఆమెకు స్వాంతననివ్వాల్సి ఉంటుంది.
 
ఉద్యోగం చేసే మహిళలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనైతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే అధిక రక్తస్రావంతో పాటు కడుపునొప్పి ఎక్కువ అవుతుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అందుకే నెలసరి సమయంలో శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు