చల్లటి నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారా?

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:44 IST)
చల్లటి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారు. చాలా మందికి ఇది నమ్మశక్యం కాదు. వేడి నీటితో స్నానం చేస్తేనే మంచిదని విశ్వసిస్తారు. చల్లని నీరు త్రాగినా, వాటితో స్నానం చేసినా జలుబు, దగ్గు వస్తుందని భయపడతారు. కానీ ఇది నిజం కాదు. 
 
చల్లని నీరు వలనే జలుబు దగ్గు వస్తుందనుకుంటే పొరపాటు. చన్నీటితో స్నానం చేస్తే నెల రోజుల్లో బరువు తగ్గుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చల్లటి నీటితో స్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నీరు శరీరానికి తగిలినప్పుడు రక్తప్రసరణ పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్తకణాలు వృద్ధికి దోహదపడతాయి. 
 
అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా చన్నీటి స్నానం ఎంతో మంచిది. చలికాలంలో చల్లని నీటితో ఎలా స్నానం చేయాలని బాధపడుతుంటారు. కానీ దాని ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పక ఇష్టపడతారు. ఎనర్జీని పెంచుతుంది. చర్మసంరక్షణకు చన్నీటి స్నానం ఎంతో ఉపకరిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు