అల్లం 'టీ' తీసుకుంటే అధిక బరువు తగ్గుతారా..?

బుధవారం, 19 సెప్టెంబరు 2018 (10:36 IST)
అధిక బరువు తగ్గాలనుకునే వారు కేవలం వ్యాయామం మాత్రం చేస్తే సరిపోదు. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఈ పదార్థాలను తినడం మానేస్తే బరువు తగ్గే అవకాశలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలానే చక్కెర అధికంగా ఉండే పండ్ల రసాలు, శీతలపానీయాలు, చిప్స్, నూనె పదార్థాలు అస్సలు తినరాదు.
 
ప్రతిరోజూ ఉదయాన్నే అల్లంతో తయారుచేసిన టీని తీసుకోవడం వలన కూడా అధిక బరువు తగ్గుతారు. మరి ఈ అల్లం టీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అల్లం తురుము వేసుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత ఆ నీటిని వడగట్టి క్రమం తప్పకుండా తీసుకోవాలి. 
 
దాంతో అధిక బరువు తగ్గుతుంది. అదే అల్లం టీలో కొద్దిగా నిమ్మరసం లేదా తేనెను కలుపుకుని తీసుకుంటే కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. శరీర రోగనిరోధశక్తిని పెంచుటకు అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు