ప్రతిరోజూ పుదీనా ఆకుల కషాయాన్ని తీసుకుంటే?

శుక్రవారం, 31 ఆగస్టు 2018 (10:21 IST)
పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకుని దీంతో దంతాలు తోముకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పుదీనా ఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని తీసుకోవడం వలన అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
 
చర్మం దురదలుగా ఉన్నప్పుడు ఈ పుదీనా ఆకులను నలిపి ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. పుదీనా మిశ్రమాన్ని నుదుటిపై రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్యలు తొలగిపోతాయి. తద్వారా దంత సంబంధిత వ్యాధులు దరిచేరవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు