కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా... వంకాయ దివ్యౌషదంగా...

సోమవారం, 18 జూన్ 2018 (10:08 IST)
కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా వంకాయ ఆరోగ్యానికి పనిచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఇందులో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో విషపదార్థాలను తొలగించుటకు సహాయపడుతుంది.
 
మధుమేహంతో బాధపడేవారికి వంకాయ చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది. అధిక విటమిన్స్ కూడిన ఈ వంకాయలో ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి. 
 
కొలెస్ట్రాల్‌ను తగ్గించికోవాలంటే వారానికి రెండు సార్లు వంకాయను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఇందులో మినరల్స్, విటమిన్స్, కార్బొహైడ్రెట్స్, ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు