యాలకులు కిడ్నీలకు మేలు చేస్తాయా?

గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:12 IST)
యాలకులు సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనది. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట యాలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. యాలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.
 
యాలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. యాలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. యాలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
యాలుక్కాయలు తింటుంటే జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలు తగ్గి వెంట్రుకలు బలోపేతం అవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు