తుమ్ములు ఆగకుండా వస్తున్నాయా? ఇలా చేస్తే సరి

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:31 IST)
మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, చూర్ణం చేసి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని రోజూ ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూను తేనె కలిపి ఆకుని చుట్టి మొత్తం నమిలి మింగాలి. ఇందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అలర్జీతత్వం తగ్గి సమస్య తగ్గిపోతుంది.
 
అలాగే శిరోజాలు బాగా పెరిగేందుకు మెంతులు, మినుములు, ఉసిరక పెచ్చుల చూర్ణాలను ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని కలిపి సీసాలో నిల్వ వుంచుకుని వారంలో రెండుసార్లు రాత్రిపూట తగినంత పొడిని తీసుకుని అది బాగా మునిగేటట్లు నిమ్మరసం పోసి ఉదయం వరకూ నానించి పదార్థాన్నంతా బాగా కలిపి తలకు పట్టించి రెండు గంటల ఆగి కుంకుడు లేదా శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఐతే గర్భస్రావం కలుగజేసే గుణం వున్నందున గర్భవతులు మెంతులు వాడకపోవడం మంచిది.
 
కొలస్ట్రాల్ సమస్యకు 150 గ్రాముల మెంతి పొడి, 50 గ్రాముల శొంఠి పొడి కలిపి వుంచుకుని రోజూ ఉదయం, సాయంత్రం పూటకు 2 నుంచి 3 గ్రాముల పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గి చక్కటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు