వేపకాడల కషాయంలో మిరియాల పొడుము వేసి...

మంగళవారం, 13 అక్టోబరు 2020 (22:47 IST)
వేపకాడల కషాయంలో మిరియాల పొడుము వేసి త్రాగించడం ద్వారా దీర్ఘకాలిక మొండి జ్వరాలు తగ్గుముఖం పడతాయి.
 
ఉదయం పరగడుపున రెండు చెంచాల వేపాకు రసం సేవించినట్లయితే కడుపులో వున్న విషక్రిములు నశిస్తాయి.
 
పాత బెల్లం, మిరియాల చూర్ణం పెరుగుతో కలిపి సేవించినట్లయితే గొంతు బొంగురుపోవడం తగ్గిపోతుంది.
 
జామ పువ్వులు నేతితో ఉడికించి కండ్లపై వేసి కట్టినట్లయితే కండ్ల కలకలు తగ్గిపోతాయి.
 
మందార చెట్టు వేర్లు నూరి నువ్వుల నూనెలో కలిపి సేవిస్తుంటే స్త్రీల రక్తస్రావము తగ్గుతుంది.
 
ప్రతిరోజూ నారింజ రసం సేవిస్తుంటే అజీర్తి తొలగి, ఆకలి వేస్తుంది.
 
తేనె ఒక భాగం, టమోటా రసం రెండు భాగములు కలిపి భోజనతూర్పర్వం సేవించినట్లయితే అరుచి తగ్గి ఆకలి కలుగుతుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు