జాజి నూనె వాడితే ఫలితం ఏంటి?

మంగళవారం, 24 డిశెంబరు 2019 (21:30 IST)
మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి పలు రకాల నూనెలు బాగా ఉపయోగపడుతాయి. కొన్ని నూనెలు చేసే మేలు గురించి చూద్దాం.
 
1. ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గిపోయాయి.
 
2. బకెట్ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి.
 
3. నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు పొత్తి కడుపు మీద రాస్తే మంచిది.
 
4. తలలో పేలు బాధిస్తుంటే కొబ్బరినూనెలో జాజితైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు.
 
5. మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెని వాడితే మంచి ఫలితం ఉంటుంది.
 
6. జాజినూనె వాడుక వలన గుండె పని తీరును పెంచుతుంది.
 
7. చెంచా పాలమీగడలో నాలుగు చుక్కలు చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గుముఖం పడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు