బెండకాయలోని ఆరోగ్య రహస్యాలు...

శుక్రవారం, 28 డిశెంబరు 2018 (22:20 IST)
మనం నిత్యం వాడుకునే కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఇది అనేక రకములైన పోషక విలువలను కలిగి ఉంది. బెండకాయ మాంసకృత్తులు, పీచుపదార్దాలు, ఫోలెట్, కాల్షియం మొదలైన వాటిని కలిగి ఉంది. వీటితో పాటు బెండకాయలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం, రాగి, మాంగనీసు, జింక్ లాంటివి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. దీనివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా దీనిలో పీచు, విటమిన్‌ సి చాలా ఎక్కువగా ఉంటుంది.
 
2. అంతేకాకుండా మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము. దీనిలో గల డయూరిటిక్ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌‌ను నయము చేయడములో సహకరిస్తుంది.
 
3. బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధి చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
 
4. బెండకాయను చిన్నచిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక వాటిని తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది.  
 
5. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే షుగర్ స్థాయిలు తగ్గుతాయి.
 
6. దీనిలో ఉండే పెక్టిన్‌.. బ్లడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతో పాటు అయోడిన్‌ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్‌ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు