శివునికి పాలతోనే ఎందుకు అభిషేకం చేస్తారు..? (video)

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (05:02 IST)
శివుడు అభిషేక ప్రియుడు అనేది జగమెరిగిన సంగతే. ఎన్నో రకాల అభిషేకాలు శివయ్యకు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ప్రీతికరమైన అభిషేకం పాలతో చేసేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే చాలా మందికి శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారనే అనుమానం వుంటుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 
 
శివరాత్రి రోజు, మహాశివుడు తాండవం ఆడతాడని భక్తులు అపార నమ్మకం. తాండవం చేయడం అంటే, విశ్వాన్ని సృష్టించేది. విశ్వాన్ని ప్రళయంతో అంతం కూడా చేస్తుంది. తాండవం ఆడుతూ ఉగ్రంగా ఉండే శివుడిని శాంతింపజేయడానికి పాలను ఎంచుకున్నారు. 
 
ఎందుకంటే పాలు అనేది సాత్విక ఆహారం. కాబట్టి ఆయనకు పాలతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా పాలతో పాటు తేనెను కూడా అభిషేకాల్లో శాంతింప చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. 
 
మహాశివరాత్రి రోజే సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకోవడ౦తో శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ సమయంలో భగభగ మండిపోతున్న శివుడి గొంతును ఉపశమింపజేయడానికి దేవతలు పాలు పోయడంతో శివుడు శాంతించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అందుచేత పాలతో అభిషేకం చేసిన వారికి ఈతిబాధలు వుండవని.. దారిద్ర్యం తొలగిపోతుందని వారు సెలవిస్తున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు