రక్తహీనతకు రాగులతో చెక్!

ఆదివారం, 9 డిశెంబరు 2018 (14:55 IST)
మన పూర్వీకులు రాగులతో అన్న, సంగటి ముద్దలను చేసుకుని పుష్టిగా ఆరగించేవారు. అంతేనా రాగిరొట్టెలు చేసుకునేవారు. జావ కాచుకుని తాగేవారు. అయితే, ఇపుడు రాగులు కంటికి కనిపించడం లేదు. నేటి యువత రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం మానేశారు. నిజానికి రాగులతో తయారు చేసిన ఆహారపదార్థాలను నిత్యం ఆరగిస్తుంటే మధుమేహం, బీపీ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే, అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 
 
* రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తరచూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. 
* శరీరానికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల నొప్పిని తగ్గిస్తుంది. 
* ఒత్తిడి, ఆందోళన నివారించే గుణాలు రాగుల్లో ఉన్నాయి. 
* రాగులతో తయారుచేసే మాల్ట్‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. 
* రాగుల్లో ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. 
* రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. 
* ఎదిగే పిల్లలకు రాగి జావ, మాల్ట్ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. 
* అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది.
* రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అం
* శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతలు దృఢంగా మారుతాయి. 
* రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి.
* రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. 
* చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. 
* రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు