దానిమ్మ తొక్క తీసి పారేస్తున్నారా? ఇవి తెలిస్తే భద్రంగా దాచేస్తారు

బుధవారం, 27 డిశెంబరు 2023 (23:52 IST)
దానిమ్మ తొక్కను తీసాక వాటిని వ్యర్థ పదార్థంగా భావిస్తూ విసిరివేస్తాము. కానీ దానిమ్మ తొక్క ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాము. దానిమ్మ తొక్కలో ప్రోటీన్, పొటాషియం, కాల్షియం వంటి అనేక పోషకాలున్నాయి. దానిమ్మ తొక్కలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దగ్గు, గొంతు నొప్పిని నివారించగలవు.
 
జీర్ణ సమస్యలను నివారించడంలో దానిమ్మ తొక్క ప్రయోజనకరంగా ఉంటుంది. పొట్ట వాపు, సంక్రమణ సమస్యను తగ్గించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మంలో ముడుతలను తగ్గించడంలో దానిమ్మ తొక్కలు సహాయపడతాయి.
 
దానిమ్మ తొక్కను సౌందర్య సాధనంగా వినియోగిస్తుంటారు. దానిమ్మ తొక్కను పౌడర్ రూపంలో డాక్టర్ సలహాతో వినియోగించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు