భారత్‌ వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం.. గుట్టు విప్పిన పాక్ మాజీ దౌత్యవేత్త

ఆదివారం, 10 జనవరి 2021 (10:41 IST)
2019లో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ వెల్లడించారు. టీవీ చర్చల్లో పాక్‌ సైన్యం తరఫున మాట్లాడే ఆయన ఓ ఉర్దూ ఛానెల్‌తో ఈ విషయాన్ని తెలిపారు.

ఈ దాడిలో ఎవరూ చనిపోలేదంటూ చెప్పుకుంటున్న పాకిస్తాన్‌కు ఈ వ్యాఖ్యాలతో ఇరుకున పడ్డట్టు అయింది. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహతి దాడికి పాల్పడగా..40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్‌ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

ఈ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని ఆనాడు పాక్‌ చెప్పుకురాగా..తాజాగా మాజీ దౌత్యవేత్త 300 మంది చనిపోయినట్లు చెప్పడంతో..గతంలో పాక్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు