అంగారకుడిపై సూపర్ టెక్నాలజీ.. అంతేకాదు.. దేవుడి విగ్రహం కూడా..?

శుక్రవారం, 10 జులై 2020 (20:04 IST)
Mars
నాసాకు చెందిన రోవర్ అంగారకుడిపై పరిశోధన చేస్తోంది. అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులను అంచనా వేసి అక్కడి అక్కడి ఫోటోలను భూమి మీదకు పంపిస్తుంది. ఇలా పంపిన ఫొటోల్లో ఎర్రని ఇసుక, పెద్ద కొండ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ నివసించే ఏలియన్స్ మానవుల కంటే అత్యాధునిక టెక్నాలజీతో అడ్వాన్స్‌గా వున్నాయనేందుకు ఈ ఫోటోలే నిదర్శనం.
 
ఈ కొండకు దిగువ ప్రాంతంలో మనం వాడే అత్యాధునిక జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో వినియోగించే ఇంజన్ లాంటి ఇంజన్ ఉన్నట్టుగా యూఎఫ్ఓలపై పరిశోధన సాగించే స్కాట్ సి వేరింగ్ చెప్తున్నారు. 
 
దుమ్ముకు కొట్టుకునిపోయిన పాత ఇంజిన్‌లా వుందని.. దీన్ని బట్టి చూస్తే అంగారకుడిపై వుండే ప్రాణాలు మనకంటే అడ్వాన్స్‌గా వున్నారని స్కాట్ సి అంటున్నారు. అంతేకాదు, కొండకు దిగువ ప్రాంతంలోనే రాగి లేదంటే బంగారంతో చేసిన ఓ విగ్రహం కనిపించినట్టు చెప్పారు. దాని కళ్ళు విచిత్రంగా ఉన్నాయని, పెద్దదైన తల, విశాలమైన ఛాతి భాగం కలిగిన ఎత్తైన విగ్రహంగా స్కాట్ పేర్కొన్నారు. 
 
ఆ విగ్రహం అక్కడ నివసించే ప్రాణుల దేవుడి విగ్రహం అయ్యి ఉండొచ్చని స్కాట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్కాట్ తన ఈటి డేటాబేస్ బ్లాక్‌లో రాసుకొచ్చారు. అంగారకునిపై దేవుని విగ్రహానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు